శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (09:39 IST)

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరో తరుణ్

టాలీవుడ్ హీరో తరుణ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. 
 
హైదరాబాద్ నగరంలో తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటన ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ సమీపంలోని అల్కాపూరులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
 
టీఎస్ 09, ఈఎక్స్ 1100 అనే నంబరు కారులో తరుణ్ ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో తరుణ్‌కు పెద్దగా గాయాలు కాకుండా బయటపడినట్టు తెలుస్తోంది. 
 
కారు ప్రమాదం తర్వాత, తరుణ్ స్వయంగా ఫోనులో మాట్లాడి, మరో కారును తెప్పించుకుని వెళ్లిపోయాడని యాక్సిడెంట్‌ను చూసిన స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.