బాలుడిపై యువకుడి అత్యాచారం.. హైదరాబాదులో దారుణం
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ 23 అనే యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.