బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:59 IST)

క్యూ నెట్ కేసులో బాలీవుడ్ నటులకు నోటీసులు

క్యూ నెట్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు మరోమారు నోటీసులు జారీచేశారు. మొదటి నోటీసులకు స్పందించని ఆరుగురు బాలివుడ్ నటులకు రెండో సారి నోటీసులు ఇచ్చారు. వీరిలో బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీలు ఉన్నారు. 
 
ఈ ముగ్గురు రెండో నోటీసుకు తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. మరో ముగ్గురు పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, చోప్రా ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. క్యూ నెట్ కేసులో మొత్తం 500 వందల మందికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో క్యూ నెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.