శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (18:11 IST)

చంద్రబాబును బూతులు తిట్టాలని జగన్ చెప్పారు : సారీ అని చెప్పా.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

vasantha krishna prasad
వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడినున్నారు. ఆయన ఎవరో కాదు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మరో రెండు రోజుల్లో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటానని చెప్పారు. 
 
మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబుకు వద్దకు వెళ్తానని చెప్పారు. పైగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుతో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు, విభేదాలు లేవన్నారు. పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్నీ మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఆయన వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారని ఆరోపించారు. మైలవరం టిక్కెట్ ఇస్తానని చెబుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైకాపాలో ఉండలేకే టీడీపీ చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టేవారికే వైకాపాలో సీట్లు ఇస్తారని ఆయన అన్నారు.