మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:32 IST)

సీఎం జగన్ కోసం తల నరుక్కునేందుకు సిద్ధం : మంత్రి ఆదిమూలపు

adimulapu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తాను తల తెగ నరుక్కునేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి పునర్‌‌వ్యవస్థీరకరించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 25 మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు లేదా నలుగురు మినహా మిగిలినవారందరూ తమతమ మంత్రిపదవులను కోల్పోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా సీఎం జగన్ తనకు గొప్ప అవకాశం ఇచ్చారన్నారు. పైగా, జగన్ నాయకత్వంలో పని చేయడం గొప్ప అనుభవమన్నారు. సీఎం లక్ష్యాలకు అనుగుణంగా, ఆయన అంచనాలను అందుకునే విధంగా శాయశక్తులా పని చేశానని తెలిపారు. అందుకే జగన్ కోసం తన తల కోసుకోవడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. 
 
గత పాలకులు రాష్ట్రంలో విద్యను, విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. విద్య పేదరికానికి అడ్డురాదన్నదే సీఎం జగన్ నినాదమన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.