శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 జూన్ 2019 (21:20 IST)

ఇక నేను పూర్తిగా పొలిటికల్ సన్యాసినయ్యా... జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్య

అనంతపురం మాజీ ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ నేతలనే తిట్టారు జె.సి. అలాంటి జేసీ తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెబుతూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ దెబ్బకి సైకిల్ అడ్రెస్ గల్లంతయ్యింది. దీనితో సైలెంట్ అయిపోయారు జె.సి. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కడా ఏమీ మాట్లాడని జె.సి. మొదటిసారి అనంతపురంలో మాట్లాడారు.
 
జగన్ మోహన్ రెడ్డి మా వాడేనని, తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పుకొచ్చారు. తాను బిజెపిలోకి వెళతానని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని. అసలు నేను రాజకీయాల్లో ఉండడం లేదని, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తాను ఎవరు చెప్పినా రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదని..ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేసి తీరుతానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. తన వారసులు ఇక నుంచి రాజకీయాల్లో ఉంటారే తప్ప నేను ఉండనన్నారు.