శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:47 IST)

పార్టీ నేతలపై అక్రమ కేసులు: చంద్రబాబు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతూ.. ఏపీ ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

లేఖలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మిట్టపల్లి గ్రామ పంచాయతీలో వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని చెప్పారు.

మరో టిడిపి నాయకుడు మనోహర్‌ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, కేసులు పెట్టడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించేలా చేయాలని, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసిపి నేతలు గందరగోళం నెలకొల్పుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.