శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (15:19 IST)

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ... సుప్రీంకు వెళ్లాలనే ఆలోచనలో...

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో ఇక ఏపీ హైకోర్టులో న్యాయం జరగదని భావించిన బాబు లాయర్లు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. 
 
క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు ఆలకించిన న్యాయమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన తీర్పును కేవలం ఒకే ఒక వ్యాక్యంతో వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అంటూ తీర్పు చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలు హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది.