సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:13 IST)

నారా చంద్రబాబు నాయుడికి డెంగ్యూ ఫీవర్ వస్తే పరిస్థితేంటి?: నారా లోకేష్

Chandra Babu
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న జైలులో డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తున్నప్పటికీ జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మండిపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలపై ఇటీవల అరెస్టయ్యారు. దీని తర్వాత ఆయన అరెస్టయిన రాజమండ్రి జైలులో డెంగ్యూ జ్వరం విస్తరిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా ఈ జైలులో ఓ ఖైదీ డెంగ్యూతో చనిపోయాడని, చంద్రబాబు నాయుడుకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉందని నారా లోకేష్ అన్నారు. కావున చంద్రబాబు నాయుడును తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని అభ్యర్థించారు.