శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:28 IST)

ఈ నెల 18 వరకు ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. 2020-21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ముందుగా వెల్లండించింది.

ఈ గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోపు కళాశాల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలని పేర్కొన్నారు.

బోర్డు అకౌంటుకు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయాలని ప్రిన్సిపల్స్‌కు తెలిపారు. ఎంఎన్‌ఆర్‌, ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోపు ఆర్‌ఐఒ కార్యాలయంలో ప్రింటు తీయాలని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా చెల్లించొచ్చని పేర్కొన్నారు.