గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:52 IST)

రాజకీయవారధిగా మారుతున్న గరుడ వారధి..?

తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న గరుడ వారధి పనులు కాస్త రాజకీయవారధిగా మారిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పేరును మార్చేందుకు అధికార పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఏకంగా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు.
 
అసలు ఉన్నట్లుండి గరుడ వారధి పేరును ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సభ్యుడు బహిష్కరించాడు. దీంతో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఆ పేరు మార్పును ఆమోదించేశారు.
 
గరుడ పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనంగా గరుత్మంతుడు. ఆ పేరు మీద వారధి నిర్మిస్తుంటే ఎలా ప్రభుత్వం  మారుస్తోందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు.
 
కక్షపూరితంగా వ్యవహరిస్తూ టిడిపి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు పేరు మార్చే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం కచ్చితంగా పేరు మార్చాలని నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద గరుడ వారధి కాస్త రాజకీయ వారధిగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.