మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (11:56 IST)

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ?

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అనే విషయంపై అనంతపురంజిల్లా అటవీ శాఖ అధికారు లు పర్యాటక గ్రామమైన వీరాపురానికి వెళ్లి పరిశీలన చేశారు. విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే వలస పక్షులు వీరాపురానికి చేరకుంటున్నాయి.

ఈ తరుణంలో బర్డ్‌ప్లూ వ్యాధి జోరుగా వ్యాప్తి చెందుతుండటంతో అట వీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రవిశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్భర్‌, ఎఫ్‌బీఓ అనిల్‌ కలిసి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఏడీ రామచంద్ర, చైతన్యలును తీసుకెళ్లి పరిశీలన జరిపించారు.

వలస పక్షులు చేరుకున్న వీరాపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, హుస్సేన్‌పురం గ్రా మాలతో పాటు ఆ గ్రామ పరిసరాల్లో ఉండే చెరువుల ను పరిశీలించారు. వలస పక్షులకు బర్డ్‌ ప్లూ వ్యాధి ఏ మైనా సోకిందా? లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా  ఉ న్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు.

అయితే వ లస వచ్చిన పక్షులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  పక్షులు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలిపారు.