మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 6 జనవరి 2022 (16:43 IST)

రోజా ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో?

రోజురోజుకు సొంత నియోజకవర్గంలో శత్రువులను పెంచేసుకుంటున్నారు రోజా. ఈ మాటలు ఎవరో చెప్పడం లేదు. సాక్షాత్తు ఆమెతో కలిసే తిరిగే వాళ్ళే చెబుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాను స్థానికురాలు కాకపోయినా గెలిపించింది స్థానిక నాయకులే. కలిసికట్టుగా ఉన్న నాయకులందరూ ఇప్పుడు విడిపోయారు. రోజాను దూరంగా పెట్టారు.

 
కేవలం పార్టీకే పనిచేస్తాము. రోజాతో కలిసి పనిచేయమని స్పష్టం  చేశారు. అంతేకాదు రోజాకు ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదంటున్నారు. తమలో ఒకరు.. అంటే స్థానికంగా ఉన్నవారిరే టిక్కెట్టు ఇవ్వాలంటున్నారు. 

 
రోజాకు ప్రధానంగా నగరి, పుత్తూరు, విజయపురం, వడమాలపేట మండలాలకు చెందిన నేతలతోనే సమస్యంతా. త్వరలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. మరో సంవత్సరంలో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 
ఇలాంటి సమయంలో రోజా శత్రువులను దగ్గర చేర్చుకోవాలనుకుంటున్నారట. తనను వ్యతిరేకిస్తున్న వారిని ఒక్కొక్కరికీ దగ్గరకు చేర్చుకుని వ్యతిరేకులు అన్న మాటే లేకుండా చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి పావులు కూడా కదుపుతున్నారట. 

 
తనను వ్యతిరేకిస్తున్న వారికి సన్నిహితంగా ఉండే వారిని దగ్గరకు చేర్చుకుని తాను ఎందుకు వారిని దూరం పెట్టాల్సి వచ్చిందోనన్న విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పి వారి ద్వారా తన వ్యతిరేకులకు చెప్పించి ఆ తరువాత తానే స్వయంగా మాట్లాడుకుంటున్నారట రోజా. మరి చూడాలి రోజా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది.