శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (16:12 IST)

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అరెస్ట్

ఫేస్ బుక్ లో లైవ్ వీడియోను పోస్ట్ చేసి, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన కుటుంబం కేసులో పోలీసులు స్పందించారు. నాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ‌నమా రాఘవేంద్రరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 
 
 
ఈ సంఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాసిన గంటలోపే వనమా రాఘవను అరెస్ట్‌ చేయడం గమనార్హం. త‌న కుమారుడిని తాను వెన‌కేసుకు రావ‌డం లేద‌ని, త‌ను విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాడ‌ని వ‌న‌మా తెలిపారు. మ‌రో ప‌క్క రాఘ‌వ కూడా వాయిస్ రికార్డు చేస్తూ, వీడియో లీక్ చేశాడు. కానీ, త‌ద‌నంత‌రం ప‌రిణామాల‌లో వ‌న‌మా రాఘవను అరెస్ట్ చేసి, పోలీసులు ఆయ‌న్ని కొత్తగూడెం తరలించి కేసు విషయంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.