జగన్ సర్కారుకి చుక్కలు చూపిస్తున్న తితిదే చైర్మన్... ఏంటి సంగతి?

putta sudhakar
శ్రీ| Last Modified గురువారం, 13 జూన్ 2019 (14:10 IST)
టీటీడీ పాలకమండలిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. టిటిడి చైర్మన్ సుధాకర్ యాదవ్ తనను ఎలా తొలగిస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన పైన కొత్త అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

స్విమ్స్‌లో చైర్మన్ సుధాకర్ యాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు టీటీడీ అధికారులు నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ కారణంగా చైర్మన్ పదవి నుంచి సుధాకర్ యాదవ్‌ని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. స్విమ్స్ వ్యవహారాలపై సుధాకర్ యాదవ్‌ని వివరణ కోరి, సుధాకర్ వివరణ సంతృప్తి చెందకపోతే చైర్మన్ పదవి నుంచి పుట్టాను తొలగించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఆర్డినెన్స్ ద్వారా పాలక మండలి రద్దుకు న్యాయపరమైన సమస్యలు వుండటంతో సుధాకర్ యాదవ్ కోర్టుకు వెళ్లి కొనసాగింపు ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఆర్డినెన్స్ ఆలోచన ప్రభుత్వం విరమించుకున్నట్టు సమాచారం.దీనిపై మరింత చదవండి :