1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (23:23 IST)

ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి గాయం..

Jagan
Jagan
విజయవాడలో ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది. సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు సీఎంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన ఒక రాయి బలంగా తాకింది. 
 
వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. సీఎం జగన్  పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైనట్టు తెలుస్తోంది.
 
క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జగన్ కంటికి గాయమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Jagan
Jagan