శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:06 IST)

కేంద్ర న్యాయశాఖ మంత్రితో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు.

50 నిముషాల పాటు జరిగిన ఈ ముఖాముఖి సమావేశంలో శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై సీఎం జగన్‌ కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.
 
ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 40 నిముషాలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే. ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్‌ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్‌ షాకు విన్నవించారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం విదితమే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు.