శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 22 జూన్ 2017 (14:20 IST)

ఏవండోయ్ ఇది నిజమేనా? ఎమ్మెల్యే రోజాకు జగన్ వార్నింగా?

ప్రతి రాజకీయ పార్టీకి ఓ ఫైర్ బ్రాండ్ కావాలి. కాకపోతే ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ కొన్నిసార్లు ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంటారు. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీలో ఎంతమంది లేరూ...? జేసీ దివాకర్ రెడ్డి వంటివారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎదురుగ్గా పె

ప్రతి రాజకీయ పార్టీకి ఓ ఫైర్ బ్రాండ్ కావాలి. కాకపోతే ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ కొన్నిసార్లు ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంటారు. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీలో ఎంతమంది లేరూ...? జేసీ దివాకర్ రెడ్డి వంటివారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎదురుగ్గా పెట్టుకునీ.... పోలవరం పూర్తి చేయడం మీ వల్ల కాదని ఏకేస్తుంటారు. ఇలాంటి ఏకే నాయకులు ఇతర పార్టీల్లో కూడా వున్నారు. 
 
అంతేకాదు... రాజకీయ పార్టీలన్నాక ఫైర్ బ్రాండ్లు, సెల్ఫ్ డబ్బాలు, సెల్ఫ్ గోల్స్ వేసుకునేవారు ఇలా అనేక రకాలుగా వుంటారు. ఇంతా ఎందుకంటే... ఇప్పుడు ఎమ్మెల్యే రోజాకు జగన్ వార్నింగ్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం గురించి. రోజా సొంత పార్టీ పెద్దలను ధిక్కరిస్తూ మాట్లాడిన సందర్భాలు దాదాపు శూన్యం. 
 
కాకపోతే ఇతర నాయకులను మాత్రం చెండాడుతుంటారు. అది కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టి వుండవచ్చు. కానీ పార్టీ పరంగా బాగానే మైలేజి వచ్చిందనడంలో సందేహం లేదు. మరి అలాంటి రోజాకు జగన్ మోహన్ రెడ్డి వార్నింగులు ఇవ్వడమా...? నమ్ముదామా...?