బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (19:41 IST)

చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారు?: జోగి రమేష్

jogi ramesh
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి పొత్తులపై చర్చించేవారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. బీజేపీతో చేతులు కలుపుతూనే.. టీడీపీతో పవన్ కలుస్తున్నారని విమర్శించారు. 
 
స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామినా? అని నిలదీశారు.
 
పవన్, చంద్రబాబు మళ్లీ కలవడం ఏంటి? చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకెళ్లారన్నారు. వైఎస్‌ జగన్‌తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ప్రజలతో చేసే యుద్ధం అని తెలిపారు.
 
కోట్లాది మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లు, 66 లక్షల మంది తాతలు, వితంతువులు, వికలాంగులపై చేస్తున్న పోరాటమని జోగి వెల్లడించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
 
తండ్రి జైల్లో ఉంటే కొడుకు లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడానికి సిగ్గుపడాలి. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు.