సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (17:23 IST)

మీడియా కాన్ఫరెన్స్‌లోనే విషం తాగిన వైసీపీ మహిళా నేత.. ఏమైంది?

Joni Kumari
వైసీపీ నేత, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి మీడియా కాన్ఫరెన్స్‌లో విషం తాగారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆమె విషం తాగేశారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం రాలేదన్నారు. 
 
తాను మోసపోయానని.. పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకూ స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని కుమారి ఆరోపించారు. 
 
ఈ నెల 6న ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని మహిళా నేత వాపోయారు. ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.