శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (20:21 IST)

ఆరు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్‌..!

'దానవీరశూరకర్ణ'లో ఎన్టీఆర్ నాలుగు పాత్రల్లో కనిపిస్తే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో ఏకంగా ఆరుపాత్రల్లో కనిపించబోతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ఇందుకు వేదిక కావడం విశేషం.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ లుక్‌ రిలీజైన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ ఆరు రకాల గెటప్స్‌లో కనిపిస్తారట. శత్రువులని డైవర్ట్‌ చేయడానికి వివిధ రకాల వేషాలు వేస్తూ ఉంటాడట.

ఎన్టీఆర్‌ సరసన విదేశీ నటి ఒలివియా మోరిస్‌తో పాటు గిరిజన యువతిగా మరో హీరోయిన్‌ కూడా ఉంటుందట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్‌, శ్రియా తదితరులు నటిస్తున్నారు.