శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (11:43 IST)

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన త‌రుణంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జ‌స్టిస్ ప్ర‌మాణ స్వీకారానికి కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.