మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (13:05 IST)

ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. కడప జిల్లా వ్యక్తిపై కేసు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు చేశారంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఓ నెటిజన్ సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన వైసీపీ నాయకుడు కానాల సీఎం పరిపాలన నచ్చకపోతే రాజ్యాంగ బద్ధంగా విమర్శలు చెయ్యాలి గానీ, అసభ్యకర వ్యాఖ్యలు ఏంటని పోలీసులకు ఫిర్యాదు చేశారు.