మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:17 IST)

ఏపీలో నిర్లవణీకరణ: జగన్

నీటి కొరతను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం నిర్లవణీకరణ (డీశాలినేషన్‌) ప్రయత్నాలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేసి వినియోగించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

సీఎం జగన్‌తో ఇజ్రాయెల్‌ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్‌ బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇజ్రాయెల్‌ మొత్తం డీశాలినేషన్‌ నీటినే వినియోగిస్తోందన్నారు.

పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్‌ నీటినే వినియోగించాలని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకు కూడా వినియోగించే పరిస్థితి రావాలని సీఎం చెప్పారు. ఎక్కడ డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టాలో నివేదిక ఇవ్వాలన్నారు.

విశాఖతో ప్రారంభించి దశలవారీగా విస్తరించాలని సూచించారు. థర్మల్‌ ప్లాంట్లు డీశాలినేషన్‌ నీటినే వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. 
 
నేడు కర్నూలులో సీఎం జగన్‌ పర్యటన
నేడు కర్నూలులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

గురువారం ఉదయం 10.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.

10.50 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్ట్టర్‌లో బయలుదేరి దిన్నెదేవరపాడు సమీపంలోని రాగమయూరి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11.00 గంటలకు చేరుకుంటారు.

11.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.10 గంటలకు రాగమయూరి రిస్టార్స్‌లోని ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంటారు.

అక్కడ 11.10 గంటల నుంచి 11.40 గంటల వరకు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. 

అనంతరం 11.40 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 11.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.00 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.

12.10 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.50 గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. 1.00 గంటకు అక్కడిన ఉంచి బయలు దేరి 1.20 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు.