శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 30 జనవరి 2018 (21:57 IST)

సీఎం చంద్రబాబుకు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు... ఎందుకు?

అమరావతి: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో గల భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురాడానికి అవసరమైన రూ.969 కోట్లు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు తనతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం శాసనసభ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని ర

అమరావతి: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో గల భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురాడానికి అవసరమైన రూ.969 కోట్లు  విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు తనతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం శాసనసభ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు.
 
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా భైరవానితిప్ప ప్రాజెక్టుకు తరలింపునకు రూ.969 కోట్లు మంజూరుచేయడం ఆనందకర విషయమన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా 22,323 ఎకరాలకు సాగునీటితో పాటు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కలుగుతుందన్నారు. సాగునీటితో కళ్యాణదుర్గం, రాయదుర్గం సస్యశ్యామలం అవుతాయని, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు, రైతులు జీవితాంతం రుణపడి ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కాలవ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట తెలుగు యువత రాష్ట్ర నాయకులు ఉన్నం మారుతి చౌదరి ఉన్నారు.