బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (12:21 IST)

మీకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది... మీకు తోడుగా మేం ఉంటాం : కలెక్టర్లకు పవన్ భరోసా (Video)

pawan kalyan
అమరావతి కేంద్రంగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీల ప్రసంగం చేశారు. మంత్రుల నుండి, ఎమ్మెల్యేల నుండి ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుక‌రావాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. మీకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని, మీకు తోడుగా మేం ఉంటామన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. 2014లో చంద్రబాబు సారథ్యంలోని ఏర్పాటైన ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి గాడిలో పెట్టేందుకు ఐదేళ్ళపాటు పాటుపడిందన్నారు. కానీ, 2019లో జరిగిన ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిందని ఆ తర్వాత రాష్ట్రం మంత్రిగా నష్టపోయిందన్నారు. 
 
ఏకంగా పాతికేళ్లపాటు వెనక్కి పోయిందన్నారు. మాలాంటి వారు రాష్ట్రంలోకి రావాలంటే సరిహద్దులను కూడా దాటుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ ఇపుడు ఎంతో అనుభవశీలి అయిన చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునర్‌నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్లుగా మీ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మా ఎమ్మెల్యేల తరపున నుంచ ఏవేని సమస్యలు ఉంటే తమ దృష్టకి తీసుకునిరావాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది.