మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

దేశ ద్రోహానికి నాయకులు... నటుడు శివాజీ

ప్రముఖ నటుడు శివాజీ.. పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదుల చేశారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేర్లతో ప్రజా ధనాన్ని దోచుకొని ముఖ్యమంత్రులు పంచుకుంటున్నారంటూ ప్రముఖ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోను విడుదల చేసే ధైర్యం తనకు ఉన్నా, దాన్ని ప్రసారం చేసే ధైర్యం రెండు రాష్ట్రాల్లోనే కాక, దేశంలో ఏ మీడియాకు లేదంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులను కొని దాంతో వచ్చే డబ్బులతో సొంత జేబులు నింపుకుంటున్నారని రాజకీయ నాయకులనుద్దేశించి అన్నారు.

ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్ట్​లోనూ అనేక అవకతవకలు జరిగాయనీ, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు త్వరలోనే బయటపెడతానని శివాజీ వెల్లడించారు. మెగా కృష్ణారెడ్డి కారణంగా భాజపాకు చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.