శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:53 IST)

కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు

కోస్తా, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడనుంది.

దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో తిరిగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. దాంతో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరిగిపోయింది.

దాంతో గేట్లను ఎత్తేసి నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. వరి, సోయా, పత్తి పంటలు వేసిన రైతులు కష్టాల్లో మునిగిపోయారు.