రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు

rain
ఎం| Last Updated: బుధవారం, 15 జులై 2020 (09:11 IST)
రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీనికితోడు పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది.

ఈ ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి.

తిరువూరులో 170, విశాఖపట్నంలో 100, చోడవరంలో 80, ఉండ్రాజవరం 79, అనకాపల్లి, ఎలమంచిలిలో 60, పెనుగంచిప్రోలు 54 అవనిగడ్డ 50, పెనమలూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో
భారీ వర్షాలతో 7,010 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలోనూ పలు మండలాల్లో వేలాది ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యాయి.దీనిపై మరింత చదవండి :