సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (17:09 IST)

అర్ధరాత్రి రైతుల ఇళ్లల్లో సోదాలా?: లోకేశ్‌

రాజధాని అమరావతి కోసం శాంతియుతంగా పోరాడుతోన్న రైతుల పట్ల జగన్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.

అర్ధరాత్రి రైతుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడాన్ని ట్విట్టర్​ వేదికగా తప్పుబట్టారు. రాజధాని ప్రాంత రైతులపై ముఖ్యమంత్రి జగన్‌కు అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయబ్రాంతులకు గురిచేసి ఏమి సాధించాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడుతోన్న రైతుల పట్ల వైకాపా సర్కారు రాక్షసంగా వ్యవహరించిందని ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్​ హితవు పలికారు.