1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (09:41 IST)

ఏప్రిల్ 1 నుంచి వారికి శ్రీవారి దర్శనభాగ్యం.. 1000 టిక్కెట్ల చొప్పున?

ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్దులు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది టీటీడీ. రోజుకి 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్దులకు, వికలాంగులు దర్శన భాగ్యం కల్పిచేందుకు చర్యలు చేపడుతుంది. 
 
అయితే వీరికి అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా..లేక తిరుపతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా.. లేక ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం  వ్యక్తం చేస్తున్నారు.