శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:03 IST)

వంటమనిషిని గర్భవతిని చేసిన ఇంటి యజమాని...

పాచిపని, వంట పని చేసే యువతిని ఇంటి యజమాని గర్భవతిని చేశాడు. పెళ్లి పేరుతో నమ్మించడంతో ఆ యువతి హద్దులు దాటింది. ఫలితంగా గర్భవతి అయింది. ఇపుడు పెళ్లి చేసుకోమంటే ఇంటి యజమాని ససేమిరా అనడంతో రోడ్డెక్కింది.

పాచిపని, వంట పని చేసే యువతిని ఇంటి యజమాని గర్భవతిని చేశాడు. పెళ్లి పేరుతో నమ్మించడంతో ఆ యువతి హద్దులు దాటింది. ఫలితంగా గర్భవతి అయింది. ఇపుడు పెళ్లి చేసుకోమంటే ఇంటి యజమాని ససేమిరా అనడంతో రోడ్డెక్కింది. మహారాష్ట్రలోని భీవాండిలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఓ యువతిని సాక్షాత్తూ యజమాని పెళ్లాడతానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని భీవాండి నగరంలో వెలుగుచూసింది. 
 
భీవాండి నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యువతిని వంటమనిషిగా పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లైంగికంగా లొంగిదీసుకున్నాడు. దీంతో ఆ యువతి కాస్తా గర్భవతి అయింది. 
 
తాను గర్భవతిని అయ్యానన్న విషయం తెలుసుకున్న ఆ యువతి... పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అతని నిజస్వరూపం వెల్లడైంది. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.