శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (11:03 IST)

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్.. జగనా మజాకా

Manikyavaraprasad
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖ‌రారు చేసింది వైసీపీ అధిష్టానం. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేర‌గా.. ఆ ఎమ్మెల్సీ స్థానం మ‌ళ్లీ ఆయ‌న‌కే కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఫలితంగా ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గ‌డువు ముగియ‌నుంది.. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.
 
టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ పోటీపెట్ట‌క‌పోవ‌చ్చు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో.. ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేస్తే ఏక‌గ్రీవంగా ఎన్నిక‌కానున్నారు. రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి, టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన‌.. డొక్కా.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు.