1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జులై 2020 (17:31 IST)

4న అమరావతి కోసం 200 నగరాల్లో మెగా దీక్ష

రాజధానిని తరలించవద్దని కోరుతు దీక్షలు చేపట్టి 200 రోజులు అవుతున్న సందర్భంగా జూలై 4వ తేధి అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మోగా దీక్ష చెపట్టనున్నట్లు పరిరక్షణ సమీతి ఛైర్మెన్ ఎ.శివారెడ్డి తెలిపారు.

గురువారం ఆటోనగర్ లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని తరలించవద్దని రాజధాని రైతులే లాక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల రోజులుగా దీక్షలు చేస్తున్న ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు.

అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 200నగరాల్లో ఉదయం 10 గంటలకు రాజధాని తరలింపు తట్టుకోలేక తనువు చాలించిన వారికి నివాళులు అర్పించి మోగా దీక్ష ప్రారంభిస్తామని తెలిపారు.

రాజధాని తరలింపు చర్యను వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. వైకాపాలో కొంతమంది ప్రజాస్వామ్యక వాదులు కుడ రాజధాని తరలింపు చర్యలను వ్యతిరేకిస్తున్నరని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారని తరువాత సచివాలయం,హైకోర్టుల భవనాలను తరలిస్తున్న మని అమ్మకానికి పెడతారని ఎద్దేవాచేశారు.

ప్రభుత్వ చర్యలను కోర్టులు కూడ తప్పు పడుతున్నాయని అమరావతి పరిరక్షణ సమితి ధర్మపోరాటానికి విజయం తథ్యంమని అన్నారు. రాష్ట్రానిక సమదూరంగా ఉంటాయని నాటి ప్రభుత్వం అడిగిన వెంటనే కన్నతల్లి లాంటి భూమిని ఇచ్చిన రైతుల త్యాగాలను ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు అంగళం ఇవ్వాలన్న ఏవరైన భయపడే పరిస్థితులు నెలకోన్నాయని అన్నారు. ఇదివరద ప్రాతం,నేల బాగోలేదు, పలాన కమ్యునిటి భూములు అంటు రాజధానని తరలించడం భావ్యం కాదన్నారు. నవరాత్రులు ఉపవాస దీక్షలు చేసి శంకుస్థాపన చేసిన రాజధానిని తరిలించి మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు.

గతరెండువందల రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అగ్రహం వ్యక్తం చేశారు.రేపటి దీక్షలో అందరు పాల్గోని విజయవంతం చేయవలసినదిగా కోరారు.

ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జె.ఎ.సి.కన్వీనర్లు గద్దే తిరపతి రావు,ఆర్ వి.స్వామి,సుధాకర్, అమరావతి పరిరక్షణ సమితి మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ,రఫీ,ఎ.యమ్.రావు తదితరులు పాల్గొన్నారు.