శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 జూన్ 2022 (19:33 IST)

అర్థంకాని విధంగా మాట్లాడటం బొత్సగారి స్టైల్, ఆయనంటే నాకెంతో ఇష్టం: పవన్ కళ్యాణ్

pawan kalyan
మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ కోనసీమ అల్లర్లపైన మాట్లాడారు. జిల్లా పేరు విషయంలో కావాలనే వైకాపా అల్లర్లను సృష్టించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... '' ఒకవైపు కోనసీమ అల్లర్లు జరుగుతుంటే గడపగడపకూ కార్యక్రమాలు చేస్తారా? ఏ విషయంపైన అయినా మంత్రి బొత్సగారు చెప్పేది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అర్థంకాని విధంగా మాట్లాడటం ఆయన స్టైల్. కొన్ని విధానపరమైన తేడాలు తప్ప వాస్తవానికి బొత్స గారంటే నాకెంతో ఇష్టం.

 
సామాజిక మాధ్యమాల్లో తిట్టుకుంటుంటారు. సమస్యకు పరిష్కారం మాత్రం చూపరు. వైకాపా పాలనలో యువజనులకు ఉద్యోగాలు లేవు. కమ్మవారిని వర్గశత్రువుగా వైకాపా భావిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలను వైకాపా ఇక మర్చిపోవచ్చు. ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. శాంతి కమిటీలు వేసి కోనసీమ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. ఈ కమిటీల ద్వారా ఉధ్రేకాలను తగ్గించి స్నేహభావాన్ని పెంచాలనుకుంటున్నాం.

 
భాజపాతో తేడా వచ్చిందా అని కొందరు అడుగుతున్నారు. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ వచ్చినట్లే భాజపాతో నాకు డిస్టెన్స్ వచ్చింది అంతే తప్ప భాజపాతో మాకు మంచి సంబంధాలున్నాయి. జాతీయ నాయకులతో ఇటీవల పలు విషయాలపై చర్చలు కూడా జరిగాయి. పొత్తులు అనేది తర్వాత చెప్తాను" అన్నారు.