గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:54 IST)

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయకపోతే మీ చేయి మీరే నరుక్కున్నట్టు : మంత్రి ధర్మాన

dharmana
వచ్చే ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే మీ చేయి మీరే నరుక్కున్నట్టు అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. అలాగే, సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతూ, డబ్బులు తీసుకుంటున్న మహిళలకు విశ్వాసం, సంస్కారం లేకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న ఆసరా అనే పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మంత్రి ధర్మాన ప్రసాద రావు చెక్కులు పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఒకరు ప్రచారం చేస్తారు. ధరలు పెరగడానికి, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి సంబంధమేంటి? ధరలు దేశంలో అన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రేమను తగ్గించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారమిస్తే మోసం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని అన్నారు.