గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:24 IST)

బ్రోకర్ గా మంత్రి నాని : మంతెన సత్యనారాయణ రాజు

"మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. నాని భూతులు మాట్లాడితే వాతలు పెడతాం. మంత్రి పదవి చేపట్టినా తన బ్రోకర్ పనులు మాత్రం మానుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో  చేర్చడంలో నాని బ్రోకర్ గా మారారు" అని శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ...
 
"మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. నాని భూతులు మాట్లాడితే వాతలు పెడతాం. మంత్రి పదవి చేపట్టినా తన బ్రోకర్ పనులు మాత్రం మానుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో  చేర్చడంలో నాని బ్రోకర్ గా మారారు. ప్రతి ఒక్కరికీ మంత్రి పదవి రెండున్నర సంవత్సరాలే అని జగన్ ముందే చెప్పారు.

టీడీపీని, చంద్రబాబు తిడితే తనను మంత్రిగా కొనసాగిస్తారని కొడాలి నాని ఆశ పడుతున్నాడు. కొడాలి నాని నోరు కంటే డ్రైనేజీ శుభ్రంగా ఉంటుంది. అధికార గర్వంతో నాని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. గుట్కా సంఘానికి అధ్యక్షుడిగా కొడాలి వ్యవహరిస్తున్నారు. ,గుడివాడ అంటే ఒకప్పుడు ఆంధ్రుల ఆరాద్యదైవం ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు.

కానీ ఇప్పుడు గుడివాడ గూండా నాని గుర్తొస్తున్నారు.  ప్రజలు వైసీపీ మంత్రుల వైఖరి గమనిస్తూన్నారు. నాని నోటికి  ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కర్రుకాల్చి వాత పెడతారు" అని హెచ్చరించారు.