సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (12:10 IST)

ఉద్యోగ సంఘాలతో చర్చలు : మంత్రి నాని ఆశాభావం

ఏపీలో సీఎం జగన్‌తో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. పీఆర్సీ అంశాలు, ఉద్యోగుల నిరసనలపై ఈ సందర్భంగా చర్చలు జరుగనున్నాయి. ఇందుకోసం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. శనివారం ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నా అన్నారు.
 
ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు పేర్ని నాని. ప్రభుత్వం అన్నాక సమిష్టి బాధ్యత. మంచైనా.. చెడైనా ప్రభుత్వానిదే సమిష్టి నిర్ణయం. షరతులతో చర్చలు జరగవు. సమస్య పరిష్కారం కాదన్నారు మంత్రి పేర్నినాని.