గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (19:46 IST)

నెల్లూరులో వైకాపాలో మరోసారి వర్గపోరు..

Jagan
Jagan
నెల్లూరులో వైకాపాలో మరోసారి వర్గపోరు బహిర్గతం అయ్యింది. బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య ఈ పోరు జరుగుతోంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బంధువు రూప్ కుమార్ యాదవ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే మండే స్థాయికి విభేదాలు చేరాయి. ఇప్పటికే పరస్పర విమర్శలు, ఆధిపత్య పోరు సాగుతున్న వేళ.. శుక్రవారం రూప్ కుమార్ అనుచరుడిపై దాడి.. వర్గపోరు మరింత రాజేసింది. 
 
బాబాయ్ రూప్ కుమార్‌కు అనిల్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. రూప్ కుమార్ విమర్శలపై అనిల్ కుమార్ స్పందించారు. వైకాపా నేత హాజీపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ చెప్పారు. నెల్లూరు ఏం జరిగినా.. దానికి కారణం అనిల్ అంటూ తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.