బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2017 (17:57 IST)

తెదేపా మంత్రులకి నా శిలాఫలకం చూసైనా... మరో వివాదంలో రోజా...

శిలాఫలకాలు పెట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఎమ్మెల్యే రోజా. మాటకు మాట.. పంచ్‌కు పంచ్ అంటూ ఇంతకాలం అధికార పార్టీ నాయకుల విమర్శలకు అదే రేంజ్‌లో సమాధానం ఇస్తూ వచ్చిన రోజా శిలాఫలకాల విషయంలో కూడా ధీటుగా సమాధానమిచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన ఎమ్

శిలాఫలకాలు పెట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఎమ్మెల్యే రోజా. మాటకు మాట.. పంచ్‌కు పంచ్ అంటూ ఇంతకాలం అధికార పార్టీ నాయకుల విమర్శలకు అదే రేంజ్‌లో సమాధానం ఇస్తూ వచ్చిన రోజా శిలాఫలకాల విషయంలో కూడా ధీటుగా సమాధానమిచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ప్రారంభించిన ప్రతి పనికి సంబంధించిన శిలాఫలకంలో ఎమ్మెల్యేగా తన పేరును చివరన వేస్తూ అవమానిస్తున్నారని గతంలోనే రోజా బాధపడ్డారు. ఈ రోజు 30 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని రోజా ప్రారంభించారు. 
 
గతంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకున్నారో.. ఏమో శిలాఫలకంపై మంత్రుల కన్నా ముందుగా తన పేరును వేసుకోవడంతో పాటు ఏకంగా ఫోటోను కూడా ముద్రించుకున్నారు. ఈ శిలాఫలకంతోనైనా గతంలో టిడిపి నాయకులు చేసిన తప్పిదాలను గుర్తుచేసుకోవాలన్నారు. తమకు అవకాశం వచ్చినప్పుడు అంతకంటే దారుణంగా అవమానిస్తామన్న విషయాన్ని ప్రస్తావించడానికి ఇలా చేశామన్నారు.