శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 28 నవంబరు 2017 (16:23 IST)

గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు నిద్రపోను - రోజా(వీడియో)

సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో

సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో రోజా దీనిపై పోరాటానికి సిద్ధమయ్యరు. ఐదురోజుల పాటు పాదయాత్రను ప్రారంభించారు.
 
నగరి నుంచి తిరుమలకు వరకు 88 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది. నగరి సత్రవాడలో రోజా పాదయాత్రను ప్రారంభించారు. అశేషజనంతో పాటు వైసిపి కార్యకర్తలు, నాయకుల మధ్య రోజా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గం కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు రోజా. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయని చెప్పారు రోజా. ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనన్నారు.