సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (09:12 IST)

కాశీ పర్యటనలో నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా

rk roja
సినీ నటి, నగరి వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా కాశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రోజా పాదయాత్ర చేస్తూ పలు దేవాలయాలను సందర్శిస్తూ దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రోజా కాశీలో పర్యటించి గంగా హారతిని తిలకించారని, గంగా హారతిని వీక్షించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
చాలా మంది తమ జీవితంలో ఒక్కసారైనా గంగా హారతి చూడాలని కోరుకుంటారని, అయితే అది కొందరికే సాధ్యమవుతుందని ఆ వీడియో ద్వారా రోజా చెప్పారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో రోజా ఆధ్యాత్మిక యాత్రల్లో నిమగ్నం కావడం గమనార్హం.