శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (20:17 IST)

సిఎం జ‌గ‌న్‌ని క‌లిసి అభినందించిన‌ ఎమ్మెల్సీ క‌రీమున్నీసా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా వైస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రూహుల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఇస్లామిక్ నూతన సంవత్సర సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త‌గా ప్రకటించిన కార్పొరేషన్ల చైర్మన్లలో కూడా 12 మందికి ముస్లిం మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగరంలో ఉన్న పలు మసీదుల‌ సమస్యలను, షాదీఖానాలు, ఉర్దూ పాఠశాల సమస్యలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు.

మైనారిటీ ల సమస్యలపై తక్షణమే స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా తీసుకువచ్చిన సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేయాలని సీఎం ఓ కార్యాలయం అధికారులును ఆదేశించారు.

అనంతరం ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా మాట్లాడుతూ, మైనారిటీ లకు ఏ సమస్యలు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. మైనారిటీలకు అల్లాహ్ ఇచ్చిన వరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మైనారిటీ లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదన్నారు.

గతంలో ముఖ్యమంత్రి గా పనిచేసిన దివంగత మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారీలకు సముచిత స్థానం కల్పించి మైనారిటీలను రాజకీయంగా కూడా పెద్దపీట వేశారని నేడు ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తండ్రి ఆశయ సాధనకు మైనారిటీలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రూహుల్లా, వైసీపీ మైనారిటీ నాయకులు హఫీజుల్లా పాల్గొన్నారు.