మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (06:40 IST)

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మోసం..టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు

ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..
 
"20 శాతం మధ్యంతర భృతికి అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. కానీ 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామన్న జగన్ మాట తప్పారు. జులై నుంచే 27 శాతం అనడం దారుణం . ఏప్రిల్ నుంచి జులై మధ్యలో రిటైరైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.

ప్రభుత్వ వైఖరి చూస్తుంటే 2020 వరకూ వేతన సవరణ వచ్చేలా లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసేయటం దారుణం. గత ప్రభుత్వ పథకాలు రద్దు చేసి ఆ డబ్బు కొత్త పథకాలకు పెడుతున్నారు" అని మండిపడ్డారు.