ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - నేడు వాయుగుండంగా మారే ఛాన్స్

ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాం తదితర ప్రాంతాల్లో పడమర గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ ఆదివారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. 
 
దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వివరించింది.