సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (22:37 IST)

పోప్ ఫ్రాన్సిస్‌ని కలుసుకోనున్న మోదీ

ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లనున్న మోదీ అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని కలుసుకోనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదని ఇరు వైపుల అధికారులు దీనిపై నిర్ణయించి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, తొందరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 30వ తేదీన పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలుసుకోనున్నట్లు హర్ష్ వర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ 29 నుంచి 31 వ తేదీ వరకు జరిగే జీ-20 సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది.

గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశానికి హాజరుకానున్నారు.