శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (18:53 IST)

ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బు.. త్వరలోనే అమలు

ప్రజాపంపిణి వ్యవస్థలో కీలక మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా లబ్దిదారు రేషన్ బియ్యం వద్దనుకుంటే.. బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది.

కిలో బియ్యానికి రూ. 25 నుంచి 30 ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే డోర్ డెలివరీ విధానానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

సరుకుల డోర్ డెలివరీ, నాణ్యమైన బియ్యం సరఫరాపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కొన్ని సిఫారసులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.