గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:19 IST)

టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఆమదాలవలసలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లను, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఈ క్రమంలో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు, తమనేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.