బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:10 IST)

మటన్, చికెన్ వ్యాపారులకు కరోనా.. ఎలా వచ్చిందంటే?

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌కు వెళ్లి వచ్చిన మటన్ వ్యాపారి ఆ తర్వాత శ్రీకాళహస్తిలో జరిగిన ఒక మత సమ్మేళనంలో కూడా పాల్గొన్నాడని తేలింది. అయితే అక్కడికి వెళ్లి వచ్చిన వారిని టెస్ట్‌లు చేయించుకోమని చెబుతున్నా వినకుండా తనకేం కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని మటన్ దుకాణం తెరిచాడు. ఏకంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు వ్యాపారి మటన్ విక్రయించాడు. 
 
ఇక నిన్న అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రోజు అతని వద్ద మటన్ కొనుగోలు చేసినవారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతని వద్ద మాంసం కొనుగోలు చేసిన 14 మందిని గుర్తించినట్లు సమాచారం.
 
విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గాజువాకలోని చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం మొదలైంది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంతంర వరకు సదరు వ్యాపారి చికెన్ అమ్మినట్టు గుర్తించిన అధికారులు... అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
 
ఈ క్రమంలోనే అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన దాదాపు 14 మంది వివరాలను కనుగొన్నట్టు తెలుస్తోంది. మిగతా వారిని కూడా ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. చికెన్ వ్యాపారి నుంచి మరికొందరికి కరోనా సోకకుండా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.