గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (15:06 IST)

చికెన్ తింటే కరోనా వస్తుందా.. నిరూపిస్తే కోటి రూపాయలిస్తాం..?

కరోనాతో ప్రస్తుతం ప్రపంచమంతా గజగజలాడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ తినాలంటేనే జనం జడుసుకుంటున్నారు. దీంతో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు బంపరాఫర్ ప్రకటించారు. కోడిగుడ్లు, చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది నిరూపిస్తే రూ.కోటి రూపాయలు బహుమతి అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్‌ సొసైటీ సంయుక్తంగా వెల్లడించాయి. 
 
కరోనా వైరస్ దెబ్బకు కోడిగుడ్లు, చికెన్ ధరలు పడిపోయిన తరుణంలో పౌల్ట్రీకి పాపులరైన నామక్కల్‌లో కోళ్ల ఫారం యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీనితో కోడి గుడ్డు ధర రూ. 1.3 పడిపోగా, కోడి మాంసం రూ. 20కి తగ్గింది. 
 
ఇది కూడా కేవలం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతుల వల్లే జరిగిందని అక్కడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికెన్ తినడంతో వస్తుందని నిరూపిస్తే కోటి రూపాయలు ఆఫర్ ఇస్తామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు.